Home  »  Bollywood News  »  ఆమె 'నెహ్రూ'కి అమ్మాయిలను సప్లై చేసింది.. కంగనా సంచలన వ్యాఖ్యలు!

Updated : Feb 15, 2022

తన సినిమాలకి సంబంధించిన వార్తల కంటే, వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. గతంలో మహాత్మా గాంధీ గురించి, భారత స్వాతంత్ర్యోద్యమం గురించి వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన కంగనా.. ఈసారి మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఓ వేశ్య ఆయనకు అమ్మాయిలను సరఫరా చేసేదంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

1960ల‌లో ముంబైలోని రెడ్‌ లైట్‌ ఏరియాకు చెందిన ఓ వేశ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'గంగూబాయ్ క‌థియ‌వాడి'. ఆలియా భ‌ట్‌ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో ఆలియా చెప్పిన డైలాగ్స్‌ కు ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు చిన్నారులు రీల్స్‌ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన కంగనా నెహ్రూపై దారుణ వ్యాఖ్యలు చేసింది. 

"మాజీ ప్రధాని నెహ్రూకి అమ్మాయిలను సప్లై చేసి పవర్ లోకి వచ్చిన ఓ వేశ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ప్రమోషన్‌ లో భాగంగా.. కొందరు తల్లిదండ్రులు డబ్బు కోసం తమ పిల్లలతో తప్పుడు పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి." అని కోరుతూ కేంద్ర స్ట్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ట్యాగ్‌ చేస్తూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ పెట్టింది. 

మాజీ ప్రధాని నెహ్రుపై కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారతదేశ మొదటి ప్రధానమంత్రిపై ఇంతటి దారుణ వ్యాఖ్యలు చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వ్యతమవుతుండటంతో ఆమె కాసేపటికే తన పోస్ట్ ని తొలగించింది. అయితే మరో పోస్ట్ లో.. కొందరు చిన్నారులు నోట్లో బీడీ పెట్టుకొని, ఓ వేశ్యను ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కంగనా కోరింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.